T20 World Cup Super 12: నెదర్లాండ్స్ పై పాక్ ఘన విజయం.!!

T20 వరల్డ్ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై పాకిస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Pakistan Cricket Board

Pakistan Cricket Board

T20 వరల్డ్ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై పాకిస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ లో అకెర్మాన్ (27), ఎడ్వర్డ్స్ (15) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్సమెన్ అంతా సింగల్ డిజిట్ స్కోర్ చేసి పెవిలియన్ బాట పట్టారు. పాకిస్థాన్ బౌలింగ్ లో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు, వసీం జూనియర్ 2 వికెట్లు తీసి నెదర్లాండ్స్ జట్టును కట్టడి చేశారు.

92 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ జట్టు బ్యాటింగ్ లో ఓపెనర్ రిజ్వాన్ 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ బాబర్ (4 పరుగులు) బ్యాటింగ్ లో మరోసారి విఫలమయ్యాడు. ఫాఖర్ జమాన్ (20), మసూద్ (12) పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలింగ్ లో బ్రాండన్ గ్లోవర్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ గెలుపుతో WCలో పాక్ సెమీస్ ఆశలు చిగురించాయి.

 

  Last Updated: 31 Oct 2022, 02:09 AM IST