Pakistan Cricketers Wives: అందుకే తమ క్రికెటర్ల వెంట భార్యలను భారత్ కు పంపించాం: పీసీబీ మాజీ ఛైర్మన్

పీసీబీ ( పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ ఓ సంచలన విషయాన్ని బయటపట్టారు. భారత్ లో పాకిస్తాన్ చివరి ద్వైపాక్షిక క్రికెట్ 2012లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Screenshot 2022 04 14 At 4.55.24 Pm Imresizer

Screenshot 2022 04 14 At 4.55.24 Pm Imresizer

పీసీబీ ( పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ ఓ సంచలన విషయాన్ని బయటపట్టారు. భారత్ లో పాకిస్తాన్ చివరి ద్వైపాక్షిక క్రికెట్ 2012లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు. నాడు క్రికెటర్లతోపాటు వారి భార్యలను కూడా భారత్ పర్యటనకు పీసీబీ పంపించినట్లుగా చెప్పారు. అష్రాఫ్ నాడు పీసీబీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రికెటర్ల వైపు నుంచి ఎలాంటి తప్పులకు అవకాశం ఉండకూడదనే నాడు అలా చేసినట్లు చెప్పారయన.

నా హయాంలో మన జట్టు భారత్ కు పర్యటను వెళ్లినప్పుడు వారి వెంట భార్యలు కూడా ఉండాలని సూచించాను. భారత మీడియా అదే పనిగా అవకాశం కోసం ఎదురుచూస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. వెంట భార్యలు ఉంటే ఆటగాళ్లు నియంత్రణలో ఉంటారు. అంతేకాదు క్రమశిక్షణగా నడుచుకోవాలని వారికి చెప్పాం. పాకిస్తాన్ జట్టు భారత్ కు వెళ్లినప్పుడల్లా అక్కడి మీడియా మమ్మల్ని ట్రాప్ చేయాలని ప్రయత్నించేది. మన క్రికెటర్లు, దేశం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదనే నాడు అలా వ్యవహరించినట్లు అష్రాఫ్ తాజాగా వెల్లడించారు. అప్పట్లో పాకిస్తాన్ జట్టు భారత్ లో 3 వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్ లు ఆడింది.

 https://twitter.com/saleemkhaliq/status/1514090917862461443

  Last Updated: 14 Apr 2022, 04:56 PM IST