Massive fire breaks out at paint factory in Medchal’s Mallapur Industrial Area : నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామికవాడ (Mallapur Industrial Area)లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంసన్ పెయింట్ పరిశ్రమ (Paint Godown)లో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడం తో ఐదు అగ్ని మాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈరోజు సెలవు దినం కావడంతో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడం తో ప్రాణ నష్టం తప్పింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ.. తమ ఇళ్లను వదిలి బయటకు వస్తున్నారు. ఈ ఏరియా మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక హైదరాబాద్ లో ప్రతి రోజు ఎక్కడో చోట అగ్ని ప్రమాదం జరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా జీడిమెట్ల , నాచారం ఏరియాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉండడం తో అగ్ని ప్రమాదాలు తరుచు జరుగుతుంటాయి.
Read Also : AP Floods Loss : భారీ వర్షాల వల్ల ఏపీకి రూ. 6880.23 కోట్ల మేర నష్టం