TTD: వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. పొటేత్తిన భక్తజనం!

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని

Published By: HashtagU Telugu Desk
Padmavati.jpg1

Padmavati.jpg1

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఉదయం నుండి పరిమళం, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల సందర్భంగా పుష్కరిణికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు.

  Last Updated: 28 Nov 2022, 05:38 PM IST