Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీలో గ‌వ‌ర్న‌ర్‌కోటా ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ప‌ద్మ‌శ్రీ, కుంభా ర‌విబాబు

NEW MLC's

NEW MLC's

గవర్నర్ కోటా కింద కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. పద్మశ్రీ, రవిబాబులను శాసన మండలి సభ్యులుగా అధికారికంగా చేర్పిస్తూ మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన నియమాలు, నిబంధనలు, విధివిధానాలు, కార్యక్రమాలతో కూడిన పుస్తకాలతో కూడిన కిట్‌లను చైర్మన్‌ మోషేన్‌రాజు అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కర్రి పద్మశ్రీ, డాక్టర్‌ కుంభా రవిబాబు కృతజ్ఞతలు తెలిపారు.