Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు

  • Written By:
  • Updated On - January 5, 2022 / 09:13 PM IST

‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ దేశం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు.

గత ఏడాది నవంబరు 24న సింధుతాయ్‌కి గుండె పోటు రాగా లార్జ్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా శస్త్ర చికిత్స జరిగింది. అప్పట్లో ఆమె కోలుకున్నారు. కానీ ఓ వారం క్రితం ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం ఆమె తీవ్రమైన గుండె పోటుతో బాధపడుతున్న ఆమెను పుణేలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి 8.10 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్దివ దేహాన్ని మంజిరి ఆశ్రమంలో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహిచారు.