Padma Awards 2025: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం (జనవరి 25, 2025) 2025 పద్మ అవార్డుల (Padma Awards 2025) జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు మూడు విభాగాలలో ఇవ్వబడతాయి. అందులో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. భీంసింగ్ భవేష్, డాక్టర్ నీర్జా భట్ల, అథ్లెట్ హర్విందర్ సింగ్ పద్మ అవార్డులు అందుకున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో గొప్ప కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు.
గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా శనివారం నాడు పద్మ అవార్డు 2025తో సత్కరించే పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని ఈ అత్యున్నత పౌర గౌరవాలతో సత్కరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తుల పేర్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
Also Read: CEC Rajiv Kumar: ‘నకిలీ ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు మానుకోండి’: సీఈసీ రాజీవ్ కుమార్
అవార్డుల జాబితా
పద్మశ్రీ అవార్డులు
- జోనస్ మాశెట్టి (వేదాంత గురు)- బ్రెజిల్
- హర్వీందర్సింగ్ (పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్)- హరియాణా
- భీమ్ సింగ్ భవేష్ (సోషల్ వర్క్)- బిహార్
- పి. దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
- ఎల్. హంగ్ థింగ్ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్
- బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు)- మధ్యప్రదేశ్
- షేఖ్ ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
- నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు)- నేపాల్
- హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు)- హిమాచల్ ప్రదేశ్
- జుమ్టే యోమ్ మ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
- విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు)- మహారాష్ట్ర
- వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు)- కర్ణాటక
- నిర్మలా దేవి (చేతి వృత్తులు)- బిహార్
- జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
- సురేశ్ సోనీ (సోషల్ వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
- రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
- పాండి రామ్ మాండవి (కళాకారుడు) – చత్తీస్‌గఢ్
- లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్య్ర సమరయోధురాలు) – గోవా
పద్మ అవార్డుల్లో తెలుగువారు
- పద్మ విభూషణ్- దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, వైద్యం
- పద్మ భూషణ్- నందమూరి బాలకృష్ణ, కళారంగం
పద్మశ్రీ
- కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం (ఏపీ)
- మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం (ఏపీ)
- మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు (తెలంగాణ)
- మిరియాల అప్పారావు, కళారంగం (ఏపీ)
- వి. రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య (ఏపీ)