Umran Malik: వేగమొక్కటే చాలదు.. తెలివినీ వాడాలి

ఉమ్రాన్ మాలిక్.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే వీరుడు!

Published By: HashtagU Telugu Desk
Singh

Singh

ఉమ్రాన్ మాలిక్.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే వీరుడు!! సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలో మహా బలుడు!! ఆటలో గెలుపు, ఓటమి సహజం. ఈనేపథ్యంలో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను విఫల మయ్యాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ పరిణామంపై మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. ” ఇది ఉమ్రాన్‌కు మంచి పాఠం. పేస్ ఉన్న బౌలర్‌కు అది ఒక్కటే చాలదు. కొంచెం తెలివి కూడా ఉపయోగించాలి. బౌలింగ్ చేసే సమయంలో వేగంతో పాటు బుర్రనూ వాడాలి. అతను ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. ఒక్కో బ్యాటర్‌కు ఎక్కడ బంతులు విసరాలో తెలుసుకోవాలి’’ అని ఆర్పీ సింగ్ సలహా ఇచ్చాడు. ఈ కామెంట్ పై ఇప్పుడు క్రికెట్ ప్రియుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

  Last Updated: 07 May 2022, 05:08 PM IST