Site icon HashtagU Telugu

Mahender Reddy: తెలంగాణాలో క్రీడలకు సీఎం పెద్దపీట, భారీగా ప్రోత్సాహకాలు

Patnam-Mahender-Reddy

Patnam-Mahender-Reddy

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలుపరిచే క్రీడా పాలసీ దేశానికి వన్నెతెచ్చే క్రీడాకారుల నైపుణ్యం పెంచే విధంగా ఉంటుందని తెలిపారు. గురువారం ప్రముఖ క్రీడాకారిణి జ్వాల గుత్త మొయినాబాద్ అకాడమీలో అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
జ్వాలా గుత్త, బారత జాతీయ బ్యాట్ మెంటెన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బిస్వా, బ్యాట్ మెంటెన్ అసోషియేషన్ కోశాధికారి వంశి, శాట్ ఎండీ లక్ష్మి
తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడారు. దేశంలోనే మహోన్నతంగా తెలంగాణ లో క్రీడా పాలసీ రానుందన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. గతంలో పీవీ సింధు, సానియా మీర్జా ఇలాంటి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహించిందని వివరించారు.

Also Read: MLC Kavitha: అది ఈడి నోటీసు కాదు.. మోడీ నోటీసు: కల్వకుంట్ల కవిత