Site icon HashtagU Telugu

OYO Hotels: ప్రపంచ కప్ నేసథ్యంలో కొత్తగా 500 OYO హోటల్స్

OYO Hotels

New Web Story Copy 2023 07 08t173653.283

OYO Hotels: 2023 ప్రపంచ కప్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో OYO తన బిజినెస్ పై ఫోకస్ చేసింది. ఈ మేరకు కొత్త హోటళ్లను పరిచయం చేయాలనీ భావిస్తుంది. కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో OYO ఈ నిర్ణయం తీసుకుంది. మైదానానికి సమీపంలో ఉన్న హోటల్స్ ని టార్గెట్ చేసింది. ఈ మేరకు 500 హోటల్స్ ని తమ సేవలకు ఉపయోగించనుంది.

అక్టోబర్ 5న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, లక్నో, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పుణె మరియు అహ్మదాబాద్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. టోర్నమెంట్ నవంబర్ 19 న ముగుస్తుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుంది.

Read More: AP BRS: ప్రజా వ్యతిరేకతో వైసీపీ పతనం మొదలైంది: ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట