Site icon HashtagU Telugu

Nizamabad : ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు

mp dharmapuri arvind

mp dharmapuri arvind

తెలంగాణ బిజెపి పార్టీ లో ఏంజరుగుతుందో అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి కాషాయం జెండా ఎగురవేయాలని అధిష్టానం చూస్తుంటే..పార్టీ లో మాత్రం నేతల మధ్య అలకలు , గొడవలు నడుస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడడం లేదు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ లోనే ఈ తరహా అలకలు ఉంటాయని అనుకుంటే..ఇప్పుడు బిజెపి లో కూడా ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ఎన్నిక సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) కీలక వ్యాఖ్యలు చేసారు. కిషన్ రెడ్డి నైనా మంచిగా పనిచేసేలా చేయండని , అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇవ్వకండి అని తన ఆవేదనను వ్యక్తం చేసారు. ఇక విజయశాంతి (Vijayashanthi) అయితే సభ జరుగుతుండగా మధ్యలో వెళ్లిపోయింది.

తన ట్విట్టర్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకూడదని చెప్పిన వ్యక్తి..ఇప్పుడు తెలంగాణ బిజెపి పార్టీ  (BJP Party)లో ఉండడం నచ్చలేదని , అందుకే సభ నుండి వచ్చినట్లు కిరణ్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బిజెపిలో ఈటెల ఓ వర్గం , బండి సంజయ్ ఓ వర్గంలా మారింది. ఇక ఇప్పుడు నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు షాక్ ఇచ్చారు సొంత పార్టీ శ్రేణులు , కార్యకర్తలు.

ధర్మపురి అర్వింద్‌ (MP Dharmapuri Arvind) 13 మండలాల బీజేపీ అధ్యక్షులను మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ‘సేవ్ బీజేపీ ఇన్ నిజామాబాద్, జై అరవింద్ అన్నవాళ్లకే పదవులా..? జై బీజేపీ అన్నవాళ్లపై వేటు.. భారత్ మాతాకి జై.. భారతీయ జనతా పార్టీ జిందాబాద్.. వి వాంట్ జస్టిస్.. ఎంపీ అర్వింద్ ఒంటెడ్డు పొకడలు నశించాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రస్తుతం ఇది జిల్లా వ్యాప్తంగా చర్చ గా మారింది. పార్టీని ఎప్పటినుంచో నమ్ముకుని ఉన్న నేతలను పట్టించుకోకుండా కొత్తవారిని అవకాశం ఇవ్వడం ఏంటి అని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది..అధికార పార్టీ సంక్షేమ పధకాలు అందిస్తూ ప్రజలను మరింత ఆకట్టుకుంటుంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మార్చడం..ఉన్న కొంతమంది నేతలు వర్గాలుగా మారడం..ఇక ఇప్పుడు జిల్లాలో పాతవారిని కాదని కొత్త వారిని ఎన్నుకోవడం..ఏంటి ఇదంతా అని సగటు బిజెపి కార్య కర్త మాట్లాడుకుంటున్నాడు. మరి దీనిపిప్ అధిష్టానం ఏమైనా కలుగచేసుకుంటుందా..లేదా ..? అనేది చూడాలి.

Read Also : Tomato: రూ. 21 ఒక్క లక్షలు విలువైన టమోటా లారీ మాయం.. అసలేం జరిగిందంటే?