Site icon HashtagU Telugu

AIMIM:నోట్ల రద్దు వైఫల్యాన్ని మోదీ అంగీకరించాలి – ఓవైసీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యాపారి నివాసంలో భారీ నగదు పట్టుబడటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని ఆరోపించారు. 2016లో జ‌రిగిన డీమోనిటైజేషన్ ) తర్వాత ఇంత నగదు ఎలా దొరికిందని ప్రధానిని అడగాలని అన్నారు. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు పలుమార్లు జరిపిన దాడుల్లో కాన్పూర్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో దాదాపు రూ.257 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎవరికి చెందుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. పేదలు, చిన్నతరహా పరిశ్రమలు మాత్రమే నష్టపోయాయని, నోట్ల రద్దు విఫలమైందని ప్రధాని అంగీకరించాలని డిమాండ్‌ చేశారు.

 

Exit mobile version