Site icon HashtagU Telugu

Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం లోకసభ జనరల్ సెక్రటరీకి లేఖ

Delhi Ordinance

New Web Story Copy 2023 07 31t124045.264

Delhi Ordinance Bill: ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం నిర్ణయించిన కొత్త ఆర్డినెన్స్ బిల్లు ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మొదటి నుంచి కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ మేరకు లోకసభ జనరల్ సెక్రటరీకి లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చే కొత్త ఆర్డినెన్స్ రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, రాష్ట్ర ప్రాథమిక హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డారు.

రూల్ ఆఫ్ ప్రొసీజర్‌లోని రూల్ 72 ప్రకారం ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ సవరణ బిల్లు 2023ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నోటీసు ఇస్తున్నాను తెలిపారు అసదుద్దీన్. ఇది ఆర్టికల్ 123ని ఉల్లంఘించిందని అన్నారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వచ్చే వారంలో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం దూకుడు పెంచింది.

ఢిల్లీలో సర్వీసుల నియంత్రణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజులకే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ తో సహా మిత్రపక్షాలు ఢిల్లీకి అనుకూలంగా మద్దతు ప్రకటించాయి.

Also Read: MLA Seethakka: వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీతక్క డిమాండ్