Site icon HashtagU Telugu

Owaisi:వాళ్ళని అరెస్ట్ చేయమంటున్న అసదుద్దీన్ ఓవైసీ

హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలపై మారణహోమం చేయాలని పిలుపునిచ్చిన వారిపై కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆ సభలో రెచ్చగొట్టేలా మాట్లాడిన సంస్థలపై కేసులు పెట్టి నిషేదించాలని అసద్ కోరారు.

ఈ విషయంలో ఎస్పీ, కాంగ్రేస్ మౌనం వహించడంతో ఆ పార్టీల నేచర్ ఎలాంటోదో అర్థమైందని, ఈ విషయంపై స్పందిస్తే ఓట్లు పడవని చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారని ఓవైసీ తెలిపారు.

మయన్మార్ లో రోహింగ్యాలను చంపినట్టే ఇండియన్ ముస్లింలపై కుట్రలు చేస్తున్నారని, ముస్లింల మారణహోమానికి పిలుపు ఇచ్చిన సంస్థలపై అన్ని పార్టీలు మౌనం వీడి తమ వైఖరి స్పష్టం చేయాలని అసద్ డిమాండ్ చేసారు. ఉత్తర ఖండ్ లోని బీజేపీ ప్రభుత్వ పూర్తి మద్దతుతోనే ధర్మ సంసద్ నిర్వహించారని ఆయన తెలిపారు. ఛత్తీస్ గడ్ లో కూడా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు లేకుండా అక్కడి ధర్మ సంసద్ ఏర్పాటు చేయడానికి వీలుకాదని ఆయన తెలిపారు.
ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బేగెల్ పై కూడా ఎంఐఎం నేత అసద్ పలు వ్యాఖ్యలు చేశారు. దేశములో మతం పేరుతో జరిగే దాడులు చాలా ప్రమాదకరమని దాన్ని ముక్తకంఠంతో ఖండించాలని అసద్ కోరారు.

హిందూ రాష్ట్రం, ముస్లింల ఉచకోత, లవ్ జిహాద్ చర్చలు ఎప్పటినుండో ఉన్నాయని అసద్ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడుతూ కరుడుగట్టిన హిందువుగా ఉండాలని, హిందువులు తమకు ఓట్లు వేయకుంటే ఇస్లాం ఆధిపత్యం చెలరేగుతుందని కాళీ చరణ్ చేసిన వ్యాఖ్యలను అసద్ ఖండించారు.

Exit mobile version