Site icon HashtagU Telugu

Health : మంచి ఆరోగ్యం కోసం అధికంగా డైట్ పాటిస్తున్నారా? ఇలాంటి పొరపాట్లు చేయకండి!

Over Diet

Over Diet

Health : ప్రస్తుత ఆధునిక సమాజంలో ఫుడ్ అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. కొందరు అనారోగ్యాన్ని కావాలని కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఆరోగ్యం మీద శ్రద్ధతో చేయాల్సిన పనుల కంటే అతి చేస్తూ వారి ఆరోగ్యాన్ని వారే పాడుచేసుకుంటున్నారు. ఉదా.. లావుగా ఉన్న వారు డైట్ చేయడం ఆరోగ్యానికి మంచిది. కానీ, కొందరు సాధారణ బరువు ఉన్నా కొద్దిగా బరువు పెరగగానే తోటి వారు అవహేళన చేస్తారని, స్లిమ్‌గా కనిపించాలనే ఆత్రుతతో సోషల్ మీడియా, ఇతరత్రా ఫ్లాట్ ఫామ్స్‌లో చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

డైట్ ఎలా పాటించాలి?

డైట్ చేయడం మంచిదే.. ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కొందరికి అలవాటుగా మారుతుంది. నిర్దిష్ట బరువు ఉన్నప్పుడు డైట్ చేయాల్సిన పనిలేదు. మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే అది మితిమీరుతుందో అప్పుడు సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. డైట్ చేయడం వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. చాలా మంది బరువు తగ్గడం కోసమో లేదా ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య లక్ష్యం కోసమో డైటింగ్ చేస్తుంటారు.అయితే,సరైన అవగాహన లేకుండా చేసే డైటింగ్ వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

డైటింగ్ చేయడం వలన కలిగే లాభాలు

సాధారణంగా అధికంగా బరువు ఉన్న వారు డైట్ పాటిస్తే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గి, బరువు అదుపులోకి వస్తుంది. ఇది ఊబకాయం వల్ల వచ్చే గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొన్ని రకాల డైట్లు (ఉదాహరణకు, తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా వచ్చే అవకాశం ఉన్నవారికి ప్రయోజనకరం.జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.

అధిక డైట్ వలన కలిగే నష్టాలు..

అధికంగా డైట్ చేయడం వలన పోషకాహార లోపం సమస్య తలెత్తవచ్చు.అన్ని రకాల ఆహారాలను దూరం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందకపోవచ్చు. ఇది అలసట, బలహీనత, జుట్టు రాలడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇక మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఆహారం పట్ల భయం, ఒత్తిడి పెరుగుతాయి. ఇది అబ్సెసివ్ ఆలోచనలు, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చు. కండరాల క్షీణత వస్తుంది. బరువు తగ్గడంపై మాత్రమే దృష్టి పెట్టి, తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే కొవ్వుతో పాటు కండరాలు కూడా తగ్గే అవకాశం ఉంది.శరీర జీవక్రియ మందగిస్తుంది.