Site icon HashtagU Telugu

Delhi Report : చలి పులి.. ఢిల్లీలో 172 మంది నిరాశ్రయులు మృతి!

Homeless

Homeless

ఢిల్లీలో గత 28 రోజుల్లో చలి కారణంగా కనీసం 172 మంది నిరాశ్రయులు మరణించారని, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (CHD) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (DUSIB) చైర్‌పర్సన్ కూడా అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చలికాలంలో నిరాశ్రయులైన వారి కోసం సరైన ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తూ వివరణాత్మక నివేదికతో కూడిన లేఖను రాసినట్లు CHD పేర్కొంది.

CHD అధికారి ప్రకారం.. సరాయ్ కాలే ఖాన్, అసఫ్ అలీ రోడ్, కశ్మీర్ గేట్, ఆజాద్‌పూర్, నిజాముదిన్, ఓఖ్లా, చాందినీ చౌక్, ఢిల్లీ గేట్ లాంటి ఏరియాల్లో నిరాశ్రయులైన ప్రజలు పెద్ద సంఖ్యలో బహిరంగ ప్రదేశాల్లో నిద్రిస్తున్నారు. జనవరి 25న ఢిల్లీలో చలి తీవ్రత కారణంగా కనీసం 106 మంది నిరాశ్రయులయ్యారని ఎన్జీవో పేర్కొంది. అయితే, DUSIB ఈ నివేదికను ఖండించింది. నిరాశ్రయులైన ప్రజలను బోర్డు చాలా బాగా చూసుకుంటుందని వివరణ ఇచ్చింది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు పడిపోయి 12.1 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడటంతో మంగళవారం తొమ్మిదేళ్లలో జనవరిలో అత్యంత శీతలమైన రోజు ఢిల్లీ చూసింది. అదేవిధంగా, దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెలలో గణనీయమైన వర్షపాతం నమోదైంది.

ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆల్ టైమ్ రికార్డు. సంవత్సరం మొదటి నెలలో రాజధాని నగరంలో 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత 122 సంవత్సరాలలో నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రిపోర్ట్ ను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్, దేశ రాజధానిలోని నిరాశ్రయులైన ప్రజలను కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి విఫలం చేసిందని ట్వీట్ చేశారు.

 

Exit mobile version