Site icon HashtagU Telugu

Road Accident: రోడ్డు ప్రమాదానికి గురైన పెళ్లి వ్యాన్

Road Accident

New Web Story Copy 2023 09 03t172943.410

Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లిన వ్యాన్ తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే..

తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న వ్యక్తుల్లో వ్యాన్ లో వృద్ధాచలం సమీపంలోని కోమంగళానికి బయలుదేరారు. ఈ సమయంలో వ్యాన్ లో 15 మంది ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వ్యాను అదుపు తప్పి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదుపుతప్పిన వ్యాన్ అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వ్యాన్ డ్రైవర్ సహా 10 మందికి పైగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వృద్ధాసం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వృద్ధాచలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వృద్ధాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: KL Rahul: గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో కేఎల్ రాహుల్ పాస్..