హీరో సిద్ధార్థ మహిళలపై నోరుపారేసుకోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా సిద్ధార్థ గతంలో మహిళలపై చేసిన కామెంట్లను రివ్యూ చేసింది. అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అతనికి కొత్తేమీ కాదని గుర్తించింది.
https://twitter.com/Actor_Siddharth/status/1478936743780904966
ఇటీవల టైమ్స్ నౌ నవభారత్ చానల్ యాంకర్ పైనా అనుచిత వ్యాఖ్యలను చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. మహిళా యాంకర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అనైతిక వ్యాఖ్యలు చేశాడని అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలపై సుమోటోగా విచారణకు జాతీయ మహిళా కమిషన్ పూనుకుంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీకి లేఖ కమిషన్ లేఖ రాసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా అతడిని నిరోధించాలని కోరినట్టు రేఖా శర్మ తెలిపారు.
https://twitter.com/Actor_Siddharth/status/1480449534190702594