Site icon HashtagU Telugu

Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం ఆగదు: రేవంత్ రెడ్డి

Revanth

Revanth

TSPSC పేపర్ లీక్ స్కామ్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో TSPSC తీరును ఎండగడుతూ, నిరుద్యోగులకు అండగా నిలుస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసనకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా యల్లారెడ్డిలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. లక్షలాది మంది తెలంగాణ యువతను ప్రభావితం చేస్తున్న TSPSC స్కామ్‌ పై పూర్తి విచారణ జరుపాలని, ప్రభుత్వ వైఫల్యంపై నిరుద్యోగులు పోరాడాలని రేవంత్ అన్నారు.

పేపర్ లీకేజ్ విషయమై తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు వ్యక్తం చేయడంతో పలు రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై తనకు సిట్ నోటీసులు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. TSPSC పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలని, కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదిత్య రెడ్డి ఉన్నారు.

Also Read: TSPSC : రేవంత్ రెడ్డికి`సిట్`నోటీసులు,పేప‌ర్ లీక్ `రివ‌ర్స్`పంచ్‌