Site icon HashtagU Telugu

OU Students: కంచె తొలగించాలంటూ ఓయూ విద్యార్థుల నిరసన

Osmania University

Osmania University

OU Students: అడ్మినిస్ట్రేటివ్ భవనం చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం నాడు యూనివర్సిటీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వైపు ర్యాలీ చేపట్టారు.

ముళ్ల తీగలు వర్సిటీల వైస్‌ఛాన్సలర్‌ నియంతృత్వ పాలనకు చిహ్నమని విద్యార్థులు అన్నారు. నిరసన సందర్భంగా కొందరు విద్యార్థులు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు కానీ…  నిరసన తెలిపిన విద్యార్థుల గుంపు చెదరగొట్టారు.