Site icon HashtagU Telugu

Hyderabad: భారీ వర్షంలో ఓయూ క్యాంపస్‌ స్టూడెంట్స్ రోడ్డుపై నిరసన

Hyderabad

New Web Story Copy 2023 07 19t150956.786

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లోని విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసనలు తెలుపుతున్నారు. ప్రొఫెసర్లు సిలబస్ పూర్తి చేయలేదని, సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని వారు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం కనీసం నాలుగు నెలల తరగతులు నిర్వహించాలి కానీ 50 రోజులు మాత్రమే తరగతులు జరిగాయి అని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పరీక్షలకు సిద్దమవుతున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో జరిగే గ్రూప్ పరీక్షలకు కొందరు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వారు సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా సమయం కావాలి అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 20 నుండి పరీక్షలను షెడ్యూల్ చేయాలని, విద్యార్థులు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. నిరసనల కారణంగా క్యాంపస్‌లో భారీ పోలీసు బలగాలను మోహరించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ విద్యార్థులు క్యాంపస్‌లోని రోడ్డుపై బైఠాయించారు.

Read more: NTR’s Gift: రామ్ చరణ్ కూతురు క్లీంకారకు ఎన్టీఆర్ స్పెషల్ గిప్ట్!