OU Hostel Building : ఓయూ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్‌ భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు....

Published By: HashtagU Telugu Desk
Osmania University

Osmania University

ఉస్మానియా యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్‌ భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. క్యాంపస్‌లో సుమారు 500 మంది విద్యార్థులు బస చేసేందుకు 2.76 ఎకరాల స్థలంలో రూ.39.50 కోట్లతో మూడంతస్తుల హాస్టల్ భవనాన్ని నిర్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 24 హాస్టళ్లు ఉండగా అందులో 12 బాలురకు, 12 బాలికలకు చెందినవి. అయితే ఎక్కువ మంది విద్యార్థులు బాలిక‌లు కావడంతో బాలురకు చెందిన కొన్ని హాస్టళ్లను బాలికలకు కేటాయించారు. క్యాంపస్‌లో బాలురు వసతి సమస్యను ఎదుర్కొంటున్నందున, బాలుర కోసం మరో హాస్టల్ భవనాన్ని నిర్మించాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయించారు. ఏడాదిలోగా హాస్టల్‌ నిర్మాణం పూర్తవుతుందని, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు తెలిపారు.

  Last Updated: 20 Nov 2022, 10:41 AM IST