Site icon HashtagU Telugu

Osmania University: ఉస్మానియా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్య

Osmania University

Osmania University

Osmania University: ఇటీవల కాలంలో వర్సిటీల మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ర్యాగింగ్ కారణంగా ఎంతో మంది విద్యార్థులు క్యాంపస్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరికొందరు ఒత్తిడి కారణంగా, ప్రేమ వ్యవహారాలు ఇలా సమస్య ఏదైనా యూనివర్సిటీలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఓయూ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . నవీన్ (22) ఎంకాం చదువుతున్న వ్యక్తి క్యాంపస్‌లోని మంజీరా హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు.

మంగళవారం రాత్రి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీన్ విషపూరిత పదార్థాలు సేవించి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: NBK 109: బాలయ్యతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ