హైదరాబాద్ విద్య, ఉపాధి రంగాల్లోనే కాకుండా వైద్య రంగంలోనూ (Health) దూసుకుపోతోంది. ఎన్నో క్రిటికల్ సర్జరీలు చేస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు దీటుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరధ రామారెడ్డి (Dr Dasaradha Rama Reddy) 102 ఏళ్ల వృద్ధురాలికి తుంటికి శస్త్రచికిత్స (Operation) చేసి అందరి ప్రశంసలు పొందారు. అంతేకాకుండా 72 గంటల తర్వాత విజయవంతంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసి వార్తల్లో నిలిచారు.
ఆయన 12 సంవత్సరల క్రితమే ఎడమ తుంటికి విజయవంతంగా శస్త్రచికిత్స (Surgery) చేశారు. అయితే మళ్లీ ఈ ఏప్రిల్ 9న ఆమె ఇంట్లో పడిపోవడంతో కుడి తుంటి భాగం ఫ్రాక్చర్ అయింది. ఈ ఫ్రాక్చర్ ని ‘ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్‘ అని అంటారు. అయితే వందేళ్ల వయసులో సర్జీలు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ డాక్టర్ దశరధ రామారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వైద్యం చేస్తే ఎలాంటి ఆరోగ్య లాభాలు నష్టాలు ఉంటాయి? అనే విషయాలను మిగతా వైద్యులతో చర్చించిన తర్వాత ఆపరేషన్ చేయడమే మేలు అని ఓ నిర్ణయం తీసుకొని తుంటి భాగానికి ఆపరేషన్ చేశారు. ఇటువంటి సర్జరీకి ప్లేట్స్, స్క్రులు వేస్తారు. కానీ వయసు రీత్యా, ఎముక బలహీనంగా ఉండటంతో TRAUMACEM నూతన పద్దతి ద్వారా ఆపరేషన్ చేశారు.
రెండు రోజుల్లోనే డిశ్చార్జ్
సాధారణంగా ఈ రకమైన శస్త్రచికిత్స చేయించుకునే రోగులు కనీసం 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ రెడ్డి సూచించారు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఎక్కువ విశ్రాంతి తీసుకోలేరు. దాని వల్ల DVT, బెడ్‌సోర్స్, LRTI, UTI, PTE లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ రామరెడ్డి ముందు చూపుతో శస్త్రచికిత్స చేసి 72 గంటల్లో డిశ్చార్జ్ చేశారు. తన తుంటికి విజయవంతంగా ఆపరేషన్ చేయడంతో డాక్టర్ రామరెడ్డి వైద్య బృందానికి సూర్యాకాంతం, కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేశారు.
Also Read: Viveka murder case :అవినాష్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా