Site icon HashtagU Telugu

Tamilanadu: శరీర అవయవ దానం..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

Tamilanadu

Tamilanadu

Tamilanadu: అవయవదానానికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మరణానికి ముందు ఎవరైతే అవయవాలను దానం చేస్తారో వారి అంత్యక్రియలను ప్రభుత్వం గౌరవప్రదంగా నిర్వహిస్తుందని చెప్పారు. వందలాది మంది రోగులకు అవయవదానం ద్వారా జీవితాన్ని అందించడంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. అవయవాలను దానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి త్యాగాలను పురస్కరించుకుని, మరణానికి ముందు అవయవ దానం చేసే వాళ్ళ అంత్యక్రియలను ప్రభుత్వమే గౌరవప్రదంగా నిర్వహిస్తుందన్నారు. గతంలో 2009లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మయత్ హాస్పిటల్ తరపున అవయవదానానికి సంబంధించి అవగాహన కార్యక్రమం చేపట్టారు.

Also Read: India Moon Base : జాబిల్లి, మార్స్ పైనా మనకు స్థావరాలు ఉండాల్సిందే : ఇస్రో చీఫ్