Site icon HashtagU Telugu

Food in Train: వాట్సాప్ ద్వారా రైలులో భోజనం ఆర్డర్ చేయండి. మీ బెర్త్‌కు ఆహారం డెలివరీ చేయబడుతుంది!

Order Food On The Train Through Whatsapp. Food Will Be Delivered To Your Berth!

Order Food On The Train Through Whatsapp. Food Will Be Delivered To Your Berth!

రైల్లో భోజనం (Food) ఆర్డరివ్వాలా! ఈ వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే బెర్త్‌ దగ్గరకే డెలివరీ! భారతీయ రైల్వే రోజురోజుకీ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అత్యంత వేగంగా ఆన్‌లైన్‌ సేవలకు అప్‌గ్రేడ్‌ అవుతోంది. ఒకప్పుడు భారీ వరుసల్లో నిలబడి టికెట్లు తీసుకొనే ప్రయాణికులు ఇప్పుడు చక్కగా మొబైల్లోనే బుక్‌ చేసుకుంటున్నారు. సాధారణంగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు భోజన సదుపాయాలన్నీ ఐర్‌సీటీసీ చూసుకుంటుంది. ప్రస్తుతం టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడే భోజనం ఆర్డరిచ్చే సదుపాయం ఉంది. అయితే వెయిటింగ్‌ టైమ్‌ ఎక్కువగా ఉండేది. ఇకపై ఈ ఇబ్బందులకు ఐఆర్‌సీటీసీ చెక్‌ పెట్టనుంది.

ప్రయాణికులకు సత్వరమే కోరుకున్న భోజనం (Food) అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. వాట్సాప్‌ ద్వారా భోజనాలకు ఆర్డరిచ్చే సదుపాయం కల్పిస్తోంది. ఇది రెండు దశల్లో అమలవ్వనుంది. మొదటి దశలో ప్రయాణికులు ఈ-టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడే వాట్సాప్‌కు ఓ సందేశం వస్తుంది. http://www.ecatering.irctc.co.in లింక్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేసి ఈ-క్యాటరింగ్‌ సేవలను ఎంచుకోవచ్చు. ఐఆర్‌సీటీసీలో నేరుగా భోజనాలను బుక్‌ చేసుకోవచ్చు. రెండో దశలో భోజనం కోసం 8750001323 వాట్సాప్‌ నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. అందులో ఆర్డర్‌ ఇస్తే మీ బెర్త్‌ దగ్గరకే డెలివరీ చేస్తారు. ఈ-క్యాటరింగ్‌ సేవలపై ఉన్న సందేహాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బాట్‌ను ఉపయోగిస్తారని తెలిసింది.

Also Read:  Land Scam: భూ దందాలు మనుగడకు ప్రమాదం! శాస్త్రవేత్తల హెచ్చరిక..