Oral Cancer: నోటి క్యాన్సర్ (Oral Cancer) చాలా ప్రమాదకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు ఒకరు నోటి క్యాన్సర్‌తో మరణిస్తున్నారని అంచనా. పొగాకు ఎక్కువగా నోటి క్యాన్సర్‌కు కారణం. ఇది కాకుండా పాత గాయాలు లేదా అల్సర్ల వల్ల కూడా కొందరిలో నోటి క్యాన్సర్ రావచ్చు. పొగాకు, సిగరెట్లు, హుక్కా తాగేవారిలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 60 శాతం ఎక్కువ. అయితే ఈ క్యాన్సర్ విషయంలో ప్రజల్లో చాలా రకాల గందరగోళం నెలకొంది. దీని కారణంగా ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుంది. నోటి క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి క్యాన్సర్ పరీక్ష
నోటి క్యాన్సర్‌ను ఏ దశలోనైనా పరీక్షించవచ్చు. ఈ వ్యాధిని తొలిదశలో పరీక్షించడం ద్వారా నివారించవచ్చు. మొదట్లో స్క్రీనింగ్ ద్వారా గుర్తించవచ్చు. ఇందుకోసం నోరు, నాలుక, గొంతు, చిగుళ్లలో క్యాన్సర్‌ను పరీక్షిస్తారు.
యువతలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుందా..?
నోటి క్యాన్సర్ గురించి ఒక అపోహ ఉంది. ఇది వృద్ధులలో మాత్రమే సంభవిస్తుందని అనుకంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఓరల్ క్యాన్సర్ ఎటియోలాజికల్ ఏజెంట్ వల్ల వస్తుంది. ఇది ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు, కాబట్టి యువకులు కూడా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Mahindra Thar 5 Door: రూ. 15 లక్షలతో మహీంద్రా కొత్త కారు.. స్పెషల్ ఏంటంటే..?
కుటుంబంలో ఎవరికైనా నోటి క్యాన్సర్ ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..?
కుటుంబంలో ఎవరికైనా నోటి క్యాన్సర్ ఉంటే దీని వల్ల పిల్లలకు కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. నోటి క్యాన్సర్ చాలా సందర్భాలలో జన్యుపరమైనది కానప్పటికీ.. ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. నోటి క్యాన్సర్‌కు పొగాకు ప్రధాన కారణం.
We’re now on WhatsApp. Click to Join.
మద్యం సేవించడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా..?
నోటిలో కమెన్సల్ బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఇది ఆల్కహాల్‌ను ఆల్డిహైడ్‌గా మారుస్తుంది., కాబట్టి ఆల్కహాల్ క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రమాదకరం. దీని వల్ల నోటి క్యాన్సర్ రావచ్చు. నోటి క్యాన్సర్‌ను నివారించడానికి పొగాకు, ఆల్కహాల్ రెండింటికీ దూరంగా ఉండాలి.
