Site icon HashtagU Telugu

Apple threat: ప్రతిపక్ష ఎంపీల ఫోన్లు హ్యాక్

Apple Threat

Apple Threat

Apple threat: ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యాపిల్‌ ముప్పు నోటిఫికేషన్‌ల స్క్రీన్‌ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

మరోవైపు టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కేంద్రం తన ఫోన్ హ్యాక్‌ చేసేందని ఆరోపించారు.

నాలాంటి పన్నుచెల్లింపుదారుల ఖర్చులతో నిరుద్యోగ అధికారులను బిజీగా ఉంచడం ఆనందంగా ఉంది. ఇంతకంటే ముఖ్యమైనది ఏమీ లేదు అంటూ శశి థరూర్ వ్యంగ్యం ప్రదర్శించాడు.

మరో కాంగ్రెస్ నాయకుడు మరియు పార్టీ ప్రతినిధి, పవన్ ఖేరా ప్రియమైన మోడీ సర్కార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అని హెచ్చరిక సైన్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదికి అలర్ట్‌ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదానీ, మోడీ ప్రభుత్వం భయపడుతుంటే జాలిగా ఉందని చెప్పారు ఆమె. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు ఫోన్లు టాప్ అవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆపిల్ యాపిల్‌ ముప్పు నోటిఫికేషన్‌లు సంచలనంగా మారాయి.

Also Read: Chandrababu : చంద్రబాబుకి బెయిల్ రావడంపై పవన్ కళ్యాణ్ సంతోషం