Opposition Meet Postponed : విపక్షాల మీటింగ్ వాయిదా.. పార్లమెంటు సమావేశాల తర్వాతే భేటీ

Opposition Meet Postponed : ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది.

  • Written By:
  • Updated On - July 3, 2023 / 10:09 AM IST

Opposition Meet Postponed : ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది. బెంగళూరు వేదికగా జూలై 13 నుంచి 14 వరకు జరగాల్సిన విపక్ష పార్టీల సమావేశాన్ని  వాయిదా వేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత తేదీని ప్రకటిస్తామని జేడీ(యూ) నాయకుడు కేసీ త్యాగి వెల్లడించారు. బీహార్, కర్ణాటక అసెంబ్లీల వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్ సమావేశాల కారణంగా మీటింగ్ ను వాయిదా వేశామని చెప్పారు.

Also read : Drone Flying-Pm Modis House : ప్రధాని మోడీ నివాసంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు?

బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై 10-24 తేదీల్లో జరగనున్నాయి. నితీష్ కుమార్ పార్టీ  జేడీయూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని(Opposition Meet Postponed) వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.