Sri Lanka Violence: హింసాత్మకంగా మారిన శ్రీలంక..ప్రతిపక్షనేతపై దాడి..!!

శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

  • Written By:
  • Updated On - May 10, 2022 / 01:10 PM IST

శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రజాగ్రహానికి తలొగ్గిన ప్రధాని మహింద రాజపక్సె పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఆందోళనలు మరింత తీవ్రంగా మారాయి. రాజపక్సే పూర్వీకులకు సంబంధించిన ఆస్తులపై ఆందోళనకారుులు నిప్పు పెట్టారు.

నిన్న ఆందోళనకారులనుంచి తప్పించుకున్న ఎంపీ అమరకీర్తి శవమై కనిపించారు. అటు ప్రతిపక్షనేత ప్రేమదాసపై ఆందోళనకారులు దాడికి దిగారు. గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రటించేందుకు సజిత్ వెళ్లారు. అప్పటికే ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రేమదాసపై ప్రభుత్వ అనుకూల వర్గీయులు దాడి చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వర్గీయులు కూడా దాడికి యత్నించారు. ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తప్పించడంలో విఫలమయ్యారంటూ..వారు దాడికి దిగారు. దీంతో ఆయన పరుగెత్తి కారెక్కి పారిపోయారు. శ్రీలంకలోనూ పలు చోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ…అయినా ఆందోళనలు అదుపులోకి రాలేదు.