Site icon HashtagU Telugu

Mayawati – INDIA : ఇండియా కూటమిలో చేరుతాం.. షరతులు వర్తిస్తాయి : మాయావతి

Mayawati Supports Ucc

Mayawati Supports Ucc

Mayawati – INDIA :  దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఏదో జరుగుతోంది ? అక్కడి పొలిటికల్ సీన్ లో త్వరలో ఏదో పెనుమార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమితో కలిసేది లేదన్న బీఎస్పీ చీఫ్ మాయావతి ఇప్పుడు గొంతు మార్చారని తెలుస్తోంది. ఈవిషయం తెలిసి ‘ఇండియా’ కూటమి తరఫున కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా.. మాయావతిని కాంటాక్ట్ చేశారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  అయితే ఆయన ఎదుట మాయావతి ఒక షరతు పెట్టారని సమాచారం. యూపీలోని మొత్తం 80 లోక్ సభ సీట్లలో 40 తమకే  కేటాయిస్తే ఇండియా కూటమితో చేతులు కలిపేందుకు అభ్యంతరం లేదని బీఎస్పీ చీఫ్ స్పష్టం చేశారట.

Also read : Chandrayaan-3: చంద్రుడిని హిందూ రాష్ట్రంగా మార్చేస్తారా??

ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీలలో మహారాష్ట్రలోని ముంబై వేదికగా జరగనున్న ఇండియా కూటమి (Mayawati – INDIA ) భేటీలో మాయావతి పెట్టిన షరతులపై చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా దాదాపు 450 లోక్‌సభ స్థానాల్లో ఒకే అభ్యర్థిని పోటీకి దింపాలని ఇండియా కూటమి భావిస్తోంది. తద్వారా బీజేపీ అభ్యర్థులకు బలమైన పోటీ ఇవ్వాలని అనుకుంటోంది.   ఈనేపథ్యంలో మాయావతి ప్రపోజల్ పై ‘ఇండియా’ ఎలా ప్రతిస్పందిస్తో వేచిచూడాలి.