Site icon HashtagU Telugu

BRS Minister: ప్రభుత్వ పధకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయి- మంత్రి కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar Imresizer

Koppula Eshwar Imresizer

BRS Minister: గడిచిన అయిదేళ్ల కాలంలో తెలంగాణ లో అద్భుతమైన ప్రగతి సాధించామని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజా అశీర్వదయాత్రలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్బంగా మీడియతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ దర్శకంలో ఒక్క ధర్మపురి నియోజకవర్గం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు చేయడం జరిగింది అన్నారు.

సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యే లు. ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతి నిధులు విలాసవంతంగా ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ.. అభివృద్ధి లో ప్రజలను భాగ స్వామ్యూలను చేశారాని అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో ప్రవేశ పెట్టి అమలు చేసిన పధకాలు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందాన్నారు. అదే విధంగా పల్లె ప్రగతి, మిషన్ భగీరథ, మనఊరు మన బడి లోనూ ప్రజల్లో మార్పు తీసుకొని రావడం జరిగిందాన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు అభివృద్ధి ప్రగతిని గమనించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.