Birth Certificate: అక్టోబర్ 1 నుంచి జనన మరణాల నమోదు తప్పనిసరి

జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన ప్రకారం జనన మరణాల నమోదు తప్పనిసరి.

Published By: HashtagU Telugu Desk
Birth Certificate

New Web Story Copy 2023 09 14t153517.497

Birth Certificate: జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన ప్రకారం జనన మరణాల నమోదు తప్పనిసరి. జనన మరణాల నమోదు చట్టం 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు , ఆధార్ నంబర్, వివాహ నమోదు, నియామకం సహా వివిధ ప్రక్రియలకు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని కొత్త చట్టం చెప్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ చట్టం అమలు కానుందని కేంద్రం తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది, అక్టోబర్ 1 న చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రిజిస్టర్డ్ డేటాబేస్‌ను రూపొందించడంలో సహాయపడటానికి మార్గం సుగమం చేస్తుంది.

గత నెలలో ముగిసిన వర్షాకాల సమావేశాల్లో జనన మరణాల నమోదు బిల్లు 2023 చట్టాన్ని ఆమోదించాయి.ఆగస్టు 7న రాజ్యసభ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించగా, ఆగస్టు 1న లోక్‌సభ ఆమోదించింది. 1969 చట్టానికి సవరణ కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రయోగాత్మకంగా రూపొందించారు.

Also Read: Vijay Devarakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ, 100 కుటుంబాలకు సాయం

  Last Updated: 14 Sep 2023, 03:35 PM IST