Site icon HashtagU Telugu

IPL 2024: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, భారీగా నగదు స్వాధీనం!

Cricket Betting

Cricket Betting

IPL 2024: SOT మదాపూర్ టీమ్, గచ్చిబౌలి పోలీస్ సంయుక్తంగా గచ్చిబౌలి పరిధిలోని సిల్వర్‌కీ OYO లాడ్జ్ రూం నెంబర్ 401 పై దాడి చేసి ఇద్దరు బూకీ లను మరో ముగ్గురు పంటర్ల ను పట్టుకున్నారు.  BSFL666 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న మొత్తం నగదు రూ. 1,84,398/ ఉంది.  మాడపాటి బస్వరాజ్, అమన్ చౌదరి,  నేలం రవి, K. మణికాంత్ రెడ్డి, జీతు శర్మలన పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మాడిశెట్టి అజయ్ ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడు.  గచ్చిబౌలి పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్(IPL 2024) క్రికెట్ టోర్నీ జరుగుతున్న వేళ, దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈనేపథ్యంలో మూడో కంటికి తెలియకుండా బెట్టింగ్ రాయుళ్ల దందా జోరుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్​లో ఐపీఎల్ ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్‌ ఎస్​వోటీ పోలీసులు దాడి చేసి పట్టుకుంటున్నారు