OnePlus10 స్మార్ట్ ఫోన్ స్పెసిఫకేషన్స్ లీక్…ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..!!

OnePlusస్మార్ట్ ఫోన్లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 22, 2022 / 10:31 AM IST

OnePlusస్మార్ట్ ఫోన్లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. టెక్ ప్రియులంతా OnePlus 10 గురించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. చైనా వన్ ప్లస్ ఏస్ లాంచ్ ఈవెంట్ ను పూర్తి చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలాఖరులో భారత్ లో వన్ ప్లస్ 10ఆర్ గా రిలీజ్ కానుంది. వన్ ప్లస్ ఏస్ లాంట్ ఈవెంట్ జరిగిన కొన్ని నిమిషాల తర్వాత…కొత్త రిపోర్టు ప్రకారం వన్ ప్లస్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్ చేసింది.

టిప్ స్టర్ ఆన్ లీక్స్, డిజిట్ వనిల్లా మోడల్ యొక్క కీలకమైన స్పెసిఫికేషన్స్ ను వెల్లడించాయి. వన్ ప్లస్,  వన్ ప్లస్ 10ల రెండు చిప్ సెట్ వేరియంట్స్ ను పరీక్షీస్తోందని రిపోర్టు పేర్కొంది. రెండు ప్రోటోటైప్ లలో ఒకటి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1ప్లస్ ఎస్ఓసీ ని కలిగి ఉంది. అయితే మరొక ప్రొటోటైప్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000ఎస్ఓసీ ని కలిగి ఉంది. తుది వెర్షన్ లో ఏ చిప్ సెట్ భాగం ఉంటుందనేది స్పష్టతనివ్వలేదు.

వనిల్లా మోడల్ 8జిబి, 128జిబితోపాటు 128జిబి, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇది బ్యాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. అంతేకాదు పైన ఆక్సిజన్ ఓఎస్ 12 లేయర్ ను కలిగి ఉంటుంది. వన్ ప్లస్ 10 కెమెరా హస్సెల్ బ్లాడ్ సహకారంతో ట్యూన్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుందని రిపోర్టు పేర్కొంది. ఇది 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 2మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో వస్తుంది. వన్ ప్లస్ 9తో పోల్చి చూస్తే…48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 2మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్స్ ఉన్నాయి. సెల్ఫీల కోం 32 మెగాపిక్సెస్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది.

ఇక ఛార్జింగ్ పరంగా చూసినట్లయితే వనిల్లా వన్ ప్లస్ 10 బాక్స్ వెలుపల 150వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. 4800ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటి తక్కువగా ఉన్నప్పటికీ స్పీడ్ ఛార్జింగ్ 10ప్రో కంటే వేగంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.7అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఆల్మోడ్ డిస్ ప్లేతో వస్తుంది. డిస్ ప్లే డైనమిక్ రిఫ్రెష్ రేట్ 150Hz వరకు మారడం కోసం LTPO 2.0 టెక్నాలజీని ఉపయోగిస్తుంది. వెనిల్లా మోడల్ నుంచి అలర్ట్ స్లైడర్ కనిపించదని రిపోర్టులో పేర్కొంది.