1Year Of KGF2: కేజీఎఫ్-2కు ఏడాది.. రాకీభాయ్ ఫ్యాన్స్ డిజాప్పాయింట్!

కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Kgf2

Kgf2

ఈ రోజుల్లో ఏదైనా సినిమా సూపర్ హిట్ (Super Hit) అయితే ఆ మూవీ హీరో క్షణం తీరిక లేకుండా కథలు మీద కథలు వింటూ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు. కానీ కేజీఎఫ్ ఫేం యష్ అలియాస్ రాకీభాయ్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏప్రిల్ 14న విడుదలైన కెజిఎఫ్ చాఫ్టర్ 2 (KGF2) సృష్టించిన వసూళ్ల సునామిని ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే కేజీఎఫ్ డైరెక్టర్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే, హీరో యశ్ మాత్రం రేసులో వెనుకబడిపోయాడు.

ఎందుకంటే యష్ (Hero Yash) కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు. నర్తన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ మధ్య టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత అతను శివరాజ్ కుమార్ తో మఫ్టీ సీక్వెల్ కు వెళ్ళిపోయాడు. లైగర్ (Liger) షూటింగ్ టైంలో పూరి జగన్నాధ్ తో జరిపిన చర్చలు ఆ తర్వాత దాని ఫలితం చూశాక ముందుకెళ్లలేకపోయాయి. దీంతో యష్ ఎంత ఆలస్యమైనా సరే తొందరపడే సమస్యే లేదంటున్నాడు.

పోనీ కెజిఎఫ్ 3 ఉందా అంటే అదంత సులభంగా జరిగే వ్యవహారంలా లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ నుంచి బయటికి రావడానికి సెప్టెంబర్ దాటేస్తుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద పని చేయాలి. ఎంతలేదన్నా ఇదయ్యేలోపు 2025 వచ్చేస్తుంది. సో ఛాన్స్ లేనట్టే. యష్ మనసులో ఏముందో మీడియాకు అంతుచిక్కడం లేదు. ఆ మధ్య పుట్టినరోజుకు ఏమైనా అనౌన్స్ మెంట్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది జరగలేదు. హీరో యష్ మూవీ అప్ డేట్ (No Update) కోసం ఫాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

Also Read: Shaakuntalam Review: సమంత ‘శాకుంతలం’ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?

  Last Updated: 14 Apr 2023, 04:47 PM IST