Site icon HashtagU Telugu

J&K’s Uri: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాది మృతదేహం లభ్యం

J&K's Uri

J&K's Uri

J&K’s Uri: జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో కొనసాగుతున్న చొరబాటు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఆదివారం ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.ఈరోజు ఆదివారం ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, చనిపోయిన రెండో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.

ఉరీలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. అంతకుముందు శనివారం ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబడిన ఉగ్రవాదుల గుంపును భద్రతా దళాలు తిప్పికొట్టాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.శనివారం ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు నియంత్రణ రేఖకు సమీపంలో పడి ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకోలేకపోయామని అధికారి తెలిపారు.

Also Read: AUS vs AFG: వాట్‌ ఏ విన్నింగ్‌.. ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్థాన్‌ గెలుపు

Exit mobile version