పంజాబ్ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీకి మంచి ఆదరణ లభించింది. ఈ వర్చువల్ ర్యాలీని దాదాపు 11లక్షల మంది చూడగా, 90వేలమంది లైవ్‌లో చూశారని, రాహాల్ గాంధీ ఫేస్‌బుక్ పేజ్ నుండి 8.8 లక్షల మంది, రాహుల్ నిర్వహించిన ఈ వర్చువల్ ర్యాలీని వీక్షించినట్టు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. దీంతో రాహుల్ గాంధీకి ప్రజాదరణ ఓ రేంజ్‌లో పెరుగుతోందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
ఇక ఈ సభను యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ద్వారా, పంజాబ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే రాహుల్ గాంధీ పేస్‌బుక్ పేజీలో ఈ సభకు సంబంధించిన లైవ్ వీడియోను 6వేల మంది షేర్ చేయగా, ఈ వీడియోకి 42,000 కామెంట్లు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. కాగా ఫేస్‌బుక్ లైవ్ వీడియోను 90వేల మంది వీక్షించడం మంచి పరిణామమని కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు.
