Hyderabad: నార్సింగి వద్ద కారు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మంగళవారం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Longest Railway Tunnel : దేశంలోనే పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోడీ

  Last Updated: 20 Feb 2024, 06:43 PM IST