మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. డబ్బును వెదజల్లి, ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు కోట్ల రూపాయలు చేతులు మారుతుండగా, తాజాగా ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బిజేపికి చెందిన కోటి రూపాయలను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. బిజేపికి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన బిజేపి కౌన్సిలర్ భర్త వాహనంగా గుర్తించినట్టు తెలుస్తోంది. డబ్బుపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని పోలీసులు తెలిపారు.
One Crore seized: మునుగోడులో కోటి రూపాయల పట్టివేత!

Money