Leopard: తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత (Leopard) సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 09:25 AM IST

తిరుమలలో మరోసారి చిరుత (Leopard) సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా అధికారులు చర్యటు తీసుకుంటున్నారు. అయితే.. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా భద్రతా సిబ్బంది వెంటనే ఉండి సూచనలు అందిస్తున్నారు. అవసరమైతే భక్తులతో పాటుగా భద్రతా సిబ్బందిని కూడా పంపించాలని భావిస్తున్నారు అధికారులు. మళ్లీ చాలా రోజుల తర్వాత చిరుత తిరుమల నడకదారిలో సంచరించడం భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. తిరుమలకు వెళ్లే నడకదారిలో గత వారం కూడా ఎలుగుబంటి సంచరించింది. అయితే.. ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి అలిపిరి మెట్ల మార్గంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. అలిపిరి మార్గం మధ్యలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి మళ్లీ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. వెంటనే అటవీశాఖ అధికారుల్ని అప్రమత్తం చేశారు. అలాగే భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది టీటీడీ (TTD).. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు అధికారులు. భక్తులు గుంపులగా వెళ్లాలని.. ఒంటరిగా మెట్ల దారిలో వెళ్లొద్దని భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారు.

ఇదేకాకుండా.. గతంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు కనిపించిన ప్రదేశం సైతం ఇదే కావడంతో.. ఈ ప్రాంతం చుట్టు ప్రక్కలే చిరుతపులి స్థావరం ఉండవచ్చని భావిస్తున్నారు. ఓ చిరుత ఏకంగా తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికపై దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన తెలిసిందే. అంతకముందే మరో బాలుడిపై దాడి చేసింది. ఈ వరుస ఘటనలతో టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. బోన్లు ఏర్పాటు చేసి ఆరు చిరుతల్ని బంధించారు. ఈ క్రమంలో నడిచి వచ్చే భక్తులను ఫారెస్ట్‌ అధికారులు భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గాలి గోపురం నుంచి మోకాళ్లమిట్ట వరకు భక్తులను గుంపులుగా పంపారు. ప్రతి గుంపుతో ఇద్దరు విజిలెన్స్‌ సిబ్బందిని పంపడంతో పాటు చేతికర్రలను అందజేసి జాగ్రత్తలు చెప్పిపంపుతున్నారు.

Read Also : AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!