Suicide Bomber: కరాచీ యూనివర్సిటీ వద్ద మహిళ ఆత్మాహుతి దాడి…చైనీయులే లక్ష్యం..!!

పాకిస్తాన్ లో మంగళవారం దారుణ ఘటన జరిగింది.

  • Written By:
  • Updated On - April 27, 2022 / 12:58 AM IST

పాకిస్తాన్ లో మంగళవారం దారుణ ఘటన జరిగింది. కరాచీలో ఓ మహిళ ఆత్మాహుతి బాంబర్ గా మారింది. కరాచీ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ కు చెందిన సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాక్ వేర్పాటువాద గ్రూపునకు చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు చైనా జాతీయులతోపాటు నలుగురు మరణించారు. ఈ ఘటనను చైనా సీరియస్ గా తీసుకుంది. ఈ దారుణానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహిస్తుందని ప్రకటించింది.

కాగా తొలిసారి ఒక మహిళ ఈ విధంగా సూసైడ్ బాంబర్ మారడం కలవరపెడుతుంది. ఈ మిషన్ను తొలిసారిగా మహిళా మిలిటెంట్ గా నిర్వహించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు చైనా పౌరులు మరణించినట్లు కరాచీ పోలీసులు ధృవీకరించారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ లో వేర్పాటువాదులచే చైనా లక్ష్యాలు క్రమం తప్పకుండా దాడి చేస్తున్నాయి. బీజింగ్ తన బెల్ట్, రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పాల్గొంది. ఇక్కడి ప్రాంతంలో లాభాదాయకమైన మైనింగ్, ఇంధన ప్రాజెక్టులపై వేర్పాటువాదులు చాలా కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు ప్రయోజనాలను కాలరాస్తున్నారన్న ఆగ్రహం వారిలో ఉంది. ప్రస్తుతం ఈ ఘటన పాక్ లో కలకలం రేపింది.