Omicron: దడ పుట్టిస్తోన్న ఒమిక్రాన్…మనిషి శరీరంపై 21 గంటలు సజీవంగా వైరస్…!

కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లలో ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా...ఇప్పుడు ఒమిక్రాన్. ఇలా అనేక వేరియంట్లలో రూపాంతరం చెందుతూ ప్రజలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 11:15 AM IST

కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లలో ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా…ఇప్పుడు ఒమిక్రాన్. ఇలా అనేక వేరియంట్లలో రూపాంతరం చెందుతూ ప్రజలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో వచ్చిన అన్ని వేరియంట్లకంటే దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ మనుషుల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వేరియంట్ పై పరిశోధనలు జరగుతున్నాయి. ఈ వైరస్ ఎన్ని గంటల పాటు పర్యావరణంలో జీవించి ఉంటుందనే అంశంపై జపాన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్ వేరియంట్ 21గంటల పాటు సజీవంగా ఉంటుంది. అదే ప్లాస్టిక్ పై అయిదే దాదాపు ఎనిమిది రోజుల పాటు జీవించి ఉంటుందని టోక్యో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గర్తించారు. ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణాలు ఇవేనని తెలిపింది.

ఇక మనిషి శరీరంలో కాకుండా బయట పరిసరాల్లో కోవిడ్ 19 ఇతర కొత్త వేరియంట్లు ఎంతకాలంపాటు జీవిస్తాయన్న అంశాన్ని విశ్లేషించిన పరిశోధకులు పలు అంశాలను గుర్తించారు. ఈ పీర్ రివ్యూ అధ్యయాన్ని బయోఆర్ఐవీలో ఈ మధ్యే పోస్టు అయ్యింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్ స్ట్రెయిన్ తో పోలిస్తే రెండు రెట్ల కన్నా అధికంగా చర్మం ప్లాస్టిక్ పై జీవిస్తుందట. వాతావరణ స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ వేరియంట్లతో ఎక్కువ వ్యాప్తి జరిగినట్లు పేర్కొన్నారు. ఇతర వేరియంట్లతో పోల్చి చూసినట్లయితే ఒమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉంటుందని..అందువల్లే డెల్టా రకంతో పోల్చితే వేగంగా వ్యాప్తి జరుగుతున్నట్లు గుర్తించారు.

ఇక అధ్యయనం ప్రకారం…ఒమిక్రాన్ ప్లాస్టిక్ పై 193.5గంటల పాటు అంటే దాదాపు 8 రోజులు జీవిస్తుంది. వూహాన్ వేరియంట్ తో పోల్చితే ఇది మూడు రెట్లు అధికం. ఒక ఒరిజినల్ స్ట్రెయిన్ 56గంటలు, ఆల్ఫా 191.3 బీటా 156.6 గంటలు, డెల్టా 114 గంటల పాటు ప్లాస్టిక్ పై జీవించగలదని గుర్తించారు. ఇక చర్మం నమూనాపై ఒమిక్రాన్ 21.1 గంటలపాటు సజీవంగా ఉంటుంది. ఒరిజనల్ స్ట్రెయిన్ 8.6 , ఆల్ఫా 19.6 . బీటా 19.1 డెల్టా వేరియంట్ 16.8గంటలపాటు సజీవంగా ఉంటుందని తెలిపారు. ఆల్కాహాల్ తో తయారైనా శానిటైజర్ తో చేతుల్ని శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలో వైరస్ అంతమవుతుందని పరిశోధకులు తెలిపారు.