Site icon HashtagU Telugu

Viral Video: వృద్ధాప్యంలోను ఈమెకు ఎన్ని కష్టాలో.. బతకడం కోసం ట్రైన్స్ లో.. వైరల్ వీడియో?

Viral Video

Viral Video

ప్రస్తుత రోజుల్లో చాలామంది సుఖానికి అలవాటు పడిపోయారు. దీంతో కష్టపడాలి అన్న, ఏదైనా పని చేయాలి అన్న కూడా చాలామంది నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం జీవితంలో బాగా స్థిరపడాలి అని కష్టపడుతూ ఉంటారు. మరికొందరు అయితే వృద్ధాప్యం వచ్చినా కూడా కష్టపడుతూనే ఉంటారు. మనం ఎప్పుడైనా రోడ్డు మీదకు వెళ్ళినప్పుడు వృద్దులు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బతకడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. అందుకే మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.

అంటే మన శరీరంలో శక్తి ఉన్నంతవరకు కష్టపడి పని చేసుకుని ఆ తరువాత మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. కాగా చాలామంది వృద్ధులు ఇప్పటికీ ముసలి వాళ్లు అయినా కూడా వారి పని వారు చేసుకోగలుగుతూ ఏదైనా పని చేసుకుంటూ బతుక్కుంటూ ఉంటారు. అలాంటి వారు సమాజంలో ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక సంఘటన కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. ఒక మహిళ వృద్ధాప్యంలో కూడా బతకడం కోసం పనిచేస్తోంది.

 

ఓ 60 ఏళ్ల వయసు ఉన్న వృద్ధురాలు ట్రైన్ లో చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతోంది. ఆమె ఉదయాన్నే లేచి ప్యాకెట్లు పట్టుకుని ట్రైన్ లో అమ్ముతున్నారు. ఆమె బిస్కెట్, చాక్లెట్లు అమ్మడాన్ని రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీడియో తీసి అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలను చూసిన నెటిజన్స్ ముసలామె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వయసులో కూడా కష్టపడుతుండడం చూసి గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version