Mizoram: 78 ఏళ్ల వయసులో 9వ తరగతికి అడ్మిషన్.. ఎక్కడో తెలుసా?

మామూలుగా కొందరికి అనేక కారణాలవల్ల చదువుకోడానికి వీలుకాక వయసు మీద పడిన తర్వాత కూడా చదువుకుంటూ ఉంటారు. అలా వయసుతో సంబంధం లేకుండా చదువును కొనసా

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 04:22 PM IST

మామూలుగా కొందరికి అనేక కారణాలవల్ల చదువుకోడానికి వీలుకాక వయసు మీద పడిన తర్వాత కూడా చదువుకుంటూ ఉంటారు. అలా వయసుతో సంబంధం లేకుండా చదువును కొనసాగించిన వారు చాలామంది ఉన్నారు. తాజాగా కూడా ఒక తాత స్కూల్ కి వెళ్లి చదువుకోవడం అన్నది నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాత స్కూల్ కి వెళ్లడం ఏంటా అనుకుంటున్నారా. అవునండోయ్.. మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు.

అయితే జోక్‌ కాదు, నిజం. జిల్లాలోని హువాయికాన్‌ గ్రామానికి చెందిన లాల్‌రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తోంది. ప్రస్తుతం లాల్‌రింగథర హువాయికోన్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నాడు. 1945లో భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని ఖువాంగ్‌లెంగ్‌ గ్రామంలో జన్మించిన లాల్‌రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు.

ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు ‍మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్‌ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్‌ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు.

ఈ సందర్బంగా లాల్‌రింగథర మీడియాతో మాట్లాడుతూ నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను అని తెలిపాడు. ఈ ఘటనపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్‌కిమా మాట్లాడుతూ లాల్‌రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు అని అన్నారు. కాగా లాల్‌రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటారట. చదువు పట్ల అనుకున్న ఆసక్తి డెడికేషన్ ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.