Site icon HashtagU Telugu

Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు

Mumbai

Mumbai

Mumbai :ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంబై గ్రాంట్ రోడ్డులో 54ఏళ్ల వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రాండ్ రోడ్డులో ఉండే చేతన్ గల్లా అనే వ్యక్తి తన పొరుగువారిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

PTI ప్రకారం, ఈ సంఘటన దక్షిణ ముంబైలోని గ్రాంట్ రోడ్‌లోని పార్వతి మాన్షన్ అనే నివాస భవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి పారిపోయి స్థానికులపై దాడికి పాలుపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని గిర్‌గామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జయేంద్ర, నీలా మిస్త్రీ దంపతులు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి అరెస్టు చేశారు.

grant