Site icon HashtagU Telugu

Love Story: లేటు వయసులో ఘాటు ప్రేమ.. కూతురు లాంటి అమ్మాయితో ప్రేమలో పడిన వృద్ధుడు?

Love Story

Love Story

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఇదే విజయాన్ని గతంలో చాలామంది రుజువు చేసిన విషయం తెలిసిందే. ప్రేమకి వయసుతో సంబంధం లేదు.. ప్రేమ అనే రెండక్షరాల పదం ఎప్పుడూ ఎవరి మధ్య ఇలా కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ ప్రేమ ఎంతటికైనా తెగించడానికి సిద్ధపడేలా చేస్తుంది. తాజాగా కూడా ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వృద్ధుడు తన కూతురు వయసు ఉన్న అమ్మాయితో ప్రేమలో పడ్డమే కాకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ప్రేమ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన రామచంద్ర సాహు అనే 76 ఏళ్ళ వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. ఈ క్రమంలో భార్య మరణించింది. దీంతో దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే దాని కోసం ప్రయత్నాలు మొదులుపెట్టిన క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ కులాగర్‌ గ్రామానికి చెందిన త్రినాథ్‌ సాహు కుమార్తె సురేఖ 46 ఏళ్ళ మహిళను ను ఒకసారి చూశాడు. అయితే, అలా చూసిన తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ప్రేమలో పడ్డానని పెళ్లిచేసుకుంటానని రామచంద్ర చెప్పిన మాటలకు సురేఖ కూడా అంగీకరించింది. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీశారు. చివరకు జులై 19న భంజ్‌నగర్‌ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో తమ ప్రేమ పెళ్లిని అడ్డుకోకుండా కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించాలని ఇద్దరూ పేర్కొన్నారు

Exit mobile version