Electric Scooter: ఓలా న్యూ వెర్షన్ స్కూటర్ రూ.499 మన ఇంటికి..ఎలా అంటే?

ప్రముఖ క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా ఎన్నో రకాల ఎలక్ట్రిక్​ స్కూటర్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 09:30 AM IST

ప్రముఖ క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా ఎన్నో రకాల ఎలక్ట్రిక్​ స్కూటర్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ లు మార్కెట్ లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓలా సంస్థ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే దేశం నలుమూలలా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రోడ్డు పై రయ్‌ రయ్‌ మంటూ పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఓలా ఎస్‌1 ని కూడా రిలీజ్‌ చేసింది.

ఇకపోతే ఈ ఓలా ఎస్ 1స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే..ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్ లు ఉన్నాయి. ఈ స్కూటర్ లేటస్ట్‌ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్‌ని అందిచగలదు. ఈ స్కూటర్‌ ధర విషయానీకి వస్తే రూ.99,000 గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్‌ని బుక్‌ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే అని ఈ తేదీలలో బుక్‌ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్‌ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు ఓలా కంపెనీ చెప్పుకొచ్చింది.

Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక్కసారి చార్జ్‌ చేస్తే 131 కిలోమిటర్లు ప్రయాణించవచ్చట. ఇందులో 3 రకాల డ్రైవింగ్‌ ఆప్షన్స్‌ ఉండగా అవి ఎకో మోడ్‌లో 128 కిలోమిటర్లు, నార్మల్ మోడ్‌ లో 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో 90 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చట. దీని టాప్‌ స్పీడ్‌ 95kmphగా ఉంది. కాగా ఈ ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐదు కలర్స్‌లో అందుబాటులో లభిస్తాయిట.