Turkey: అయ్యో దేవుడా.. కొడుకు ప్రాణాల కోసం తండ్రి చేసిన పనికి సలాం !

ప్రకృతి వైపరీత్యాలు ఎంత నష్టాన్ని, దుఃఖాన్ని మిగిలుస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే.. అవి మిగిల్చే గాయాలు తీవ్రమైన వేదనను వదిలి వెళతాయి.

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 09:18 PM IST

Turkey: ప్రకృతి వైపరీత్యాలు ఎంత నష్టాన్ని, దుఃఖాన్ని మిగిలుస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే.. అవి మిగిల్చే గాయాలు తీవ్రమైన వేదనను వదిలి వెళతాయి. అలాంటి కలిచివేసే ఘటన ఇప్పుడు అందరి గుండెల్ని పిండేస్తుంది. ఇది చూసిన వారంతా అయ్యో దేవుడా అనేక మానరు. ఇంతకీ విషయం ఏంటంటే.. సోమవారం “టర్కీ” ని భూకంపం కుదిపేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన ఎంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. శిథిలాల క్రింద త్రవ్వే కొద్దీ మృతదేహాలు, కొస ప్రాణంతో కొట్టు మిట్టాడుతున్న జీవచ్చవాలు దర్శనమిస్తున్నాయి.

ఈ దుర్ఘటన మిగిల్చిన వేదనలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం అందర్నీ కలిచివేస్తుంది. శిథిలాలలో కూరుకుపోయిన తన కుమారుడి ప్రాణాల కోసం ఆ తండ్రి పడిన తాపత్రయం ఇప్పుడు అందరి హృదయాలను స్పృశిస్తుంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న సిబ్బందికి ఒక తండ్రి మృతదేహం ప్రాణాలతో ఉన్న కుమారుడు ప్రక్కప్రక్కన కనిపించారు. వారిని చూస్తే ముందుగా కొడుకు క్రింద పది ఉండగా, తనను రక్షించడానికి తండ్రి ప్రాణాలకు లెక్క చేయకుండా కుమారుడిపై పడి, రక్షించాడు. కానీ కుమారుడు బ్రతికినా తండ్రి మరణించాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నెటిజెన్స్ ఆ తండ్రికి సలాం చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రతీ ఒక్కరినీ కలివెస్తుండగా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నందున, ఇలాంటి హృదయ విదారక ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందో అని అందరూ భయపడుతున్నారు. వేలసంఖ్యలో మరణాలు, ఆస్తి నష్టం కలిగించిన ఈ భూకంపం ప్రపంచంలో చరిత్రలోనే అతి నష్టదాయకమైన దుర్ఘటన అని తెలుస్తోంది.

ఇది కాకుండా తన చెల్లి ప్రాణాలు రక్షించడానికి తన చేయి అడ్డు పెట్టి, కొన్ని గంటల పాటు ఉన్న సోదరి అందరి హృదయాలను గెలుచుకుని. పాపం అని చూస్తూ ఉండడం తప్ప చేసేదేమి లేకపోవడం చూస్తున్న వాళ్ళ వంతు అయ్యింది. భారతదేశంతో పాటు దాదాపుగా అన్ని ఇతర దేశాలు టర్కీ, సిరియాలకు మద్దతు అందిస్తున్నాయి. ఇక ఈ నష్టాన్ని మరిచిపోవడం, దాన్నుండి అంత సులభంగా బయటికి రాలేమని ఆ దేశ వాసులు అంటున్నారు.