Site icon HashtagU Telugu

Sand Seized : పెద్దిరెడ్డి డంప్ చేసిన ఇసుక సీజ్

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

గత ప్రభుత్వంలో ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. వరుస సమీక్షలు నిర్వహించి సీఎం చంద్రబాబు ఏపీ సర్వతోభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే.. వైసీపీ హయాంలో ప్రజల ప్రధానంగా ఎదుర్కున్న సమస్యల్లో ఇసుక రవాణ ఒకటి. అయితే.. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సామాన్య ప్రజలకు అందనంత దూరంలో పెట్టారు. కానీ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం గత కొన్ని వారాలుగా వైసీపీ నేతల అవినీతి అక్రమ వ్యాపార కార్యకలాపాలను బట్టబయలు చేస్తోంది. ఇప్పటికే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చద్రశేఖర్ ఇసుక, సీఫుడ్ ఎగుమతి వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

తాజాగా వైఎస్సార్‌సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిఘా పెట్టారు. పెద్దిరెడ్డి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు ములకలచెరువు మండలం రెడ్డివారిపల్లి గ్రామ సమీపంలో భారీగా పేరుకుపోయిన ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పెద్దతిప్పసముద్రం మండలంలోని సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని పాపాగ్ని నది నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి రెడ్డివారిపల్లి సమీపంలో పోగుచేసినట్లు సమాచారం. కాల్వ పనుల కోసమే ఇసుకను నిల్వ చేశారని వైసీపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.

తిరిగి 2022లో పెద్దిరెడ్డి కేబినెట్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ కంపెనీ వాహనాల్లో ఇసుకను తరలించి ఇక్కడ నిల్వ ఉంచారు. అప్పట్లో నిత్యం దాదాపు 100 టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరిగేదని నివేదికలు చెబుతున్నాయి.

వైసీపీ హయాంలో గండికోట రిజర్వాయర్‌ నుంచి పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు పంపే పనులు ప్రారంభమయ్యాయి. గాలేరి-నగరి కాలువను పెదమండ్యం, తమబలపల్లె, ములకలచెరువు మీదుగా హంద్రీ-నీవా కాలువకు అనుసంధానం చేసేందుకు రెడ్డివారిపల్లి సమీపంలో ఈ ఇసుక భారీగా పేరుకుపోయింది.

అయితే గత కొన్ని నెలలుగా పనులు నిలిచిపోయాయి. సమస్య కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఇసుక డంపులను సీజ్ చేయాలని ఆదేశించారు. నివేదికల ప్రకారం, అధికారులు దాదాపు 27,472 క్యూబిక్ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

Read Also :Almatti – Tungabhadra: ఆల్మట్టి, తుంగభద్ర దిగువ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో..!